![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -339 లో..... చెల్లి ఆ జయకి బుద్ది చెప్పి మంచి పని చేసావని గంగతో రంగా అంటాడు. మరేంటి అన్నయ్య అది ఎక్స్ ట్రాలు చేస్తుందని గంగ అంటుంది. సరే వెళదాం పద అన్నయ్య సర్ మన కోసం చూస్తున్నాడని గంగ అంటుంది. మరొకవైపు రుద్రకి అనుకోకుండా గార్డెన్ లో గంగ ఫోటో స్కెచ్ వేసినా పేపర్ కన్పిస్తుంది. అది చూసి ఎవరు గీశారు అని చూస్తే దానిపై రామనాథం పేరు ఉంటుంది. ఎంగేజ్మెంట్ రోజు రామనాథం గురించి విశ్వ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు. అసలు ఈయన ఎందుకు వచ్చినట్లు స్కెచ్ నీది ఎందుకు గీసినట్లు అని గంగ వాళ్ళతో రుద్ర అంటాడు
ఆ తర్వాత రుద్ర సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. అందులో వీరుని కలిసి రామనాథం మాట్లాడింది చూస్తాడు. అసలు తనని చూసి వీరు ఎందుకు టెన్షన్ పడుతున్నాడని రుద్ర అనుకుంటాడు. అతను నా స్కెచ్ ఎందుకు గీశాడని గంగ అంటుంది. ఇవ్వన్మీ ఆలోచించే బదులు అతన్ని కలిస్తే తెలుస్తుంది కదా అని గంగ అనగానే అవును రంగా అతని అడ్రెస్స్ కనుక్కోమని రుద్ర చెప్తాడు.మరొకవైపు రామనాథం స్కెచ్ వేస్తూ వీరు అన్నమాటలు గుర్తు చేసుకొని ఫ్రస్ట్రేషన్ తో పేపర్స్ చింపేస్తాడు. అప్పుడే తన అసిస్టెంట్ వస్తాడు.
ఏంటి సర్ ఏమైంది అని అంటాడు. ఆ వీరు వల్ల ప్రశాంతంగా లేదు నా కల ఎంతో మందికి ఉపయోగపడింది కానీ ఇప్పుడు రెండు కుటుంబాలు భ్రమలో బతుకుతున్నారని ఎమోషనల్ అవుతాడు. మీరు ఏం కంగారు పడకండి సర్.. ఆ గంగ భర్త రుద్ర.. గొప్ప వీరుడు అతనికి మీరు జరిగింది చెప్తే అంత అతనే చూసుకుంటాడని అతను చెప్పగానే మంచి సలహా ఇచ్చావని రామనాథం అంటాడు. మరొకవైపు విజయేంద్ర ప్రతాప్ ఇంటికి జయ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |